గొప్ప విజన్, మంచి మనసున్న నాయకుడు కేసీఆర్
అడగకపోయినా...తాను వాగ్ధానంచేయకపోయినా రైతులకు అండగా కేసీఆర్ నిలిచారు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-షాద్ నగర్ ప్రతినిధి)
గొప్ప విజన్, మంచి మనసున్న నాయకుడు కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని చౌదరి గూడ మండలం జిల్లేడు గూడ లో పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఫారూఖ్ నగర్ మండలంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు . ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక గొప్ప విజన్, మంచి మనసు ఉన్న గొప్ప నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఎవరు ఆడగకున్న, వాగ్దానం చేయకున్న రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి ఏటా ఎకరాకు 10 వేలు రైతు బంధు ఇస్తూ 9 ఏళ్ల కాలంలో 65 వేల కోట్లు రైతులకు నేరుగా వారి ఖాతాలో వేయటం జరిగిందన్నారు. అదేవిధంగా గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన కూడా భీమా కింద 5 లక్షలు అందిస్తున్నట్లు, ఇందుకుగాను ప్రతి ఏటా 1400 కోట్లు ప్రీమియం రైతుల తరుపున ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కాళేశ్వరం లాగే పాలమూరు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల కల సాకారం చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతు కల్లాల కోసం ప్లాట్ ఫారం లు నిర్మించుకుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వ కళ్ళు మండి కడుపు మండి 151 కోట్లు కట్టాలని నోటీసులు ఇస్తున్నారని, అదే వేరే రాష్టాల్లో చేపలు అర బెట్టటానికి కడుతుంటే ఉపాధిహామీ నుండి నిధులు ఇస్తున్నారన్నారు. కేంద్రం తెలంగాణ రైతాంగం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. యావత్ రైతాంగం గ్రహించి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చటానికి కృషి చేస్తున్నారన్నారు. మొదటి విడతలో 9 వేల పాఠశాలల్లో 1200 పాఠశాలలు జనవరిలో పూర్తి అయి విద్యార్థులకు అందుబాటులో తేవటం జరుగుతుందన్నారు. వరకు మొదటి విడతలో 9 వేలు పూర్తి చేయటానికి ఆదేశాలు ఇచ్చాం అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ఒక వెయ్యి పై చిలుకు గురుకులాలు స్థాపించి ఒక్కో విద్యార్థి మీద
లక్ష 25 వేలు వెచ్చిస్తున్నట్లు, విద్యపై పై పెట్టె నిధులు ఖర్చు లాగా కాకుండా భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం అని మంత్రిఅన్నారు. ఇందులో1150 వరకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసామన్నారు.
Home
Unlabelled
గొప్ప విజన్, మంచి మనసున్న నాయకుడు కేసీఆర్ ,,, అడగకపోయినా...తాను వాగ్ధానంచేయకపోయినా రైతులకు అండగా కేసీఆర్ నిలిచారు-- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: