రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు

భారత ఆర్మీకి రాహుల్ క్షమాపణ చెప్పాలి

ఇండియన్ ఆర్మీ కి వ్యతిరేకంగా రాహుల్ వ్యాఖ్యలా 

చైనా నుంచి రాహుల్ గాంధీ ట్రస్ట్ కు కోట్లాది రూపాయల రాక

అందుకే రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు

బిజెపి నేత బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

భారత ఆర్మీ ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన చైనా సైనికుల వీపులు పగిలేలా తరిమి కొట్టిన భారత సైనికులను ఉద్దేశించిన వ్యాఖ్యలు సరి కావన్నారు. మన సైనికులను చైనా వారు కొడుతున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గు చేటని వెల్లడించారు. రాహుల్ గాంధీ యొక్క ఈ తరహా వ్యాఖ్యలను రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు బుక్క వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. చైనీస్ అతిక్రమణలను బయటికి లాగుతున్న మన సైనికుల వార్త వచ్చినప్పుడల్లా ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దౌర్జన్యం మొదలవుతోందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు గనుకే రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని ప్రతిసారి అవమాపరుస్తూ చైనాకు మద్దతు ఇస్తుంటారని ఆయన విమర్శించారు.


చైనా ఏజెంట్ అయిన కాంగ్రెస్  పప్పు రాహుల్ గాంధీ భారత సాయుధ దళానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే భారత్ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారని, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడం ఖాయమని బిజెపి నాయకులు బుక్క వేణుగోపాల్  హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: