బడిపిల్లలను పనిపిల్లలుగా మారుస్తున్న ..
ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి
గాలి రవిరాజ్ సిపిఐ (యంయల్)రెడ్ స్టార్ పార్టి డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం కేంద్రంలోని రోజాకుంటలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులతో సిమెంటు క్యూరింగ్ మరియు పాఠశాల తరగతి గదులు శుభ్రం చేయడానికి బండలు తుడిపిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ (యంయల్) రెడ్ స్టార్ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకు పునాది వేయవలసిన ఉపాధ్యాయులు పిల్లలతో పనిచేయీస్తూ విద్యాబుద్ధులు నేర్పించకుండా కాలం గడుపుతున్నారనిఉన్నత విద్యాధికారి డిఈవో అనురాధ గారికి పాఠశాలలలో జరుగుతున్న సంఘటనలను వివరించిన నంద్యాల జిల్లా విద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు ఇకనైనా మేలుకొని పాఠశాలలను పర్యవేక్షణ చేసి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి పిల్లల ఉన్నత భవిష్యత్తుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.
Home
Unlabelled
బడిపిల్లలను పనిపిల్లలుగా మారుస్తున్న .. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి,,, గాలి రవిరాజ్ సిపిఐ (యంయల్)రెడ్ స్టార్ పార్టి డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: