అధినేత, యువరాజును పూజించేలా
ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రసంగం
ఇది టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దుస్థితికి ఉదాహరణ
బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శ
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)
శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన కుమారుడు యువరాజు అయిన మంత్రి కేటీఆర్ ను పూజించేలా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రసంగం సాగిందని రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు బుక్కా వేణుగోపాల్ విమర్శించారు. ఇది టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర దుస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కేసీఆర్ కుటుంబానికి కట్టు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో రైలు మంజూరు అనేది పౌరులకు మెరుగైన కనెక్టివిటీ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగమన్నారు. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లలో స్టాప్‌లతో వైజాగ్-కాచిగూడ రైలు కోసం మహబూబ్‌నగర్ వరకు రైలు నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఇటీవలి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం ప్రధాన కారణమన్నారు.
కానీ కేసీఆర్ అహంకారంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఆలస్యమై కోట్లాది ప్రజాధనం వృథా అయిందని బుక్కా వేణుగోపాల్ విమర్శించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లాంటి సీనియర్ నేతలు తన నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్, కేటీఆర్‌లను వేడుకోవడం నిరుత్సాహపరచడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రజావేదికలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కర్కానికి కేసీఆర్, కేటీఆర్ ను పొగుడ్తు విన్నపాలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. “మీ ఆశీస్సులు, నియోజకవర్గానికి నిధుల కోసం ఎదురు చూస్తున్నాం” అంటూ ప్రకాష్ గౌడ్ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనమని బుక్క వేణుగోపాల్ గుర్తచేవారు. బీఆర్ఎస్ పార్టీలోని శక్తివంతమైన ప్రజా ప్రతినిధులు సైతం ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సన్నీవేశాలే తెలియజేస్తున్నాయన్నారు.
Home
Unlabelled
అధినేత, యువరాజును పూజించేలా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రసంగం,,,, ఇది టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దుస్థితికి ఉదాహరణ,,,,బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: