పింఛన్ దారులపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం
గడివేముల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేముల గ్రామంలో నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట్ రెడ్డి, పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరు చరితా రెడ్డి ఆదేశాల మేరకు గడివేముల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన రాష్ట్రానికి "ఇదేం: కర్మ" కార్యక్రమంలో భాగంగా స్థానిక గడివేముల గ్రామంలోనీ ప్రజల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల గ్రామ ప్రజలతో మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ,,,
రాష్ట్ర ప్రభుత్వం అవ్వ తాతలకు వితంతువులకు వికలాంగులకు ఆసరాగా లభించే పింఛన్ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులపై ఆంక్షలు విధించి పింఛన్లను తీసివేయడం,ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలైన ప్రజలు ఆకలిని తీర్చుకుంటున్న తరుణంలో అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఎత్తివేయడం శోచనీయమని, గ్రామాలలో కరెంటు తీగలు పట్టుకుంటే కొట్టే కరెంటు షాక్ నేడు కరెంటు బిల్లులను పట్టుకుంటే షాక్ కొడుతున్నాయని, ప్రజల నిత్యవసర సరుకులపై అధిక ధరలు మోపుతూ ప్రజల మీద భారం మోపుతున్నారని గడివేముల గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గడివేముల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, నారాయణరెడ్డి,రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అవ్వరుశ్రీకాంత్ ,ముస్లిం మైనార్టీ సభ్యులు గఫూర్, జమ్మి చెట్టు సంజీవరెడ్డి, దుబ్బా రమణరెడ్డి,ఖాతా రామ్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పింఛన్ దారులపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం,,, గడివేముల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: