అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే తత్వం కేసీఆర్ ది

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు, క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిణ చేసిన మంత్రి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే తత్వం కేసీఆర్ ది అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గము మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల  పంపిణీతో పాటు క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ  కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తూ అండగా నిలబడుతున్నారని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల వారిని ప్రభుత్వ పరంగా సమానంగా గౌరవిస్తూ బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ లు అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాలు, కులాలు సమాజంలో అందరూ  బాగుండాలనే కోరుకుంటాయని, శాంతి, అహింస, సత్యం, నిజాయితీ బోధిస్తాయని అన్నారు. త్వరలో పండుగ జరుపుకోనున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.1500 కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందిస్తున్నామన్నారు.


ఈ ఒక్క రోజే 55 మందికి కళ్యాణాలక్ష్మి ,షాది ముబారాక్ చెక్కులు అందిస్తుండగా 4 ఏళ్ల కాలంలో 4833 మందికి 48 కోట్ల పై చిలుకు కల్యాణ లక్ష్మి,షాది ముబారాక్  అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్


లీడర్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు లావణ్య, కార్పోరేటర్లు, కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: