అర్హత లేనివారికి ఇల్లు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసం....

విద్యార్థి సంఘాలు ఆర్విఎఫ్, ఏఐఎఫ్బీ,మండిపాటు    

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో అర్హత కలిగి ఉన్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అర్హత లేకున్నా అధికార పార్టీ నాయకుల అండదండలతో  గ్రామాలలో ఒకే కుటుంబంలో  రెండు, మూడు, ఇల్లు మంజూరు చేస్తూ, ఇల్లు లేని అర్హత కలిగి ఉండి నిరుపేదలైన ప్రజల కు మంజూరు చేయకుండా గ్రామవాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అధికారుల పై అధికార పార్టీ నాయకుల  ఒత్తిడి తట్టికోలేక అర్హత లేని వారికి ఇళ్లపట్టలు ఇచ్చి నిరుపేదలైనవారికీ అన్యాయం చేస్తున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వనం వెంకటాద్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతకలిగిన ప్రజలకు ఇల్లు మంజూరు చేయకుండా అధికారులు ఆఫీసుల చుట్టూ ప్రజలను తిప్పుకుంటున్నారని, అధికారులు నామమాత్రపు సర్వేలు చేసి అధికార పార్టీ నాయకుల మాటలు విని  పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, పేద ప్రజలు గుడారాలలో, కిరాయి అద్దె భవనాలలో జీవనం  సాగిస్తున్నారని, గ్రామవాలంటర్స్ అర్హత కలిగిన నిరుపేదలైన ప్రజలకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని, ఒకే కుటుంబంలో కొంతమంది వ్యక్తులకు ఇచ్చిన వారికే ఇళ్ల పట్టాలు కేటాంచి పేదలకు అన్యాయం చేస్తున్నారని గతంలో సంబంధిత అధికారులకు తెలియచేసిన అధికారులు ఏమాత్రం చలనం లేకుండా ఇళ్ల పట్టాల గురించి పట్టించుకోకుండా  ఒకే కుటుంబం లో రెండు, మూడుపట్టాలు ఇచ్చారని, ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకున్నాము అని చెప్పిన సంబంధిత అధికారులు పట్టాలు ఇచ్చిన వారికే మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇచ్చి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని,  పేదలకు అన్యాయం జరగకుండా గ్రామాలలో రీ సర్వే చేసి నిజమైన నిరుపేదలైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇల్ల పట్టాలు మంజూరు చేయాలని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేసి కాలయాపన చేస్తే ప్రత్యేక్ష నిరాహార దీక్షలకు ప్రజలతో ప్రజాసంఘాలతో  ఉద్యమలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పాణ్యం మండల తాసిల్దార్ మల్లికార్జున రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమం లో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్  పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: