రైల్వే ట్రాక్ కింద అండర్ బ్రిడ్జి నిర్మించండి

ఆర్ వి ఎఫ్, ఏ ఐ ఎఫ్ బి నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని స్థానిక పాణ్యం గ్రామంలో రోడ్డు మీద ఉన్న రైల్వే ట్రాక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుకున్నారని ఆర్ వి ఎఫ్, ఏ ఐ ఎఫ్ బి నాయకులు     ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాణ్యం గ్రామంలో గత కొన్ని వందల సంవత్సరాల నుండి బనగానపల్లె రోడ్డు మీదుగా పాణ్యం మండలానికి కొనిదేడు, ఆలమూరు, గోనవరము చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు నిత్యం పాణ్యంమండలం కు విద్యా,వైద్యం, ఉపాధి, వ్యాపారాల కొరకు వస్తుంటారని,పాణ్యంలో రైల్వే గేట్ ఉండడం వలన ప్రతి 30 నిమిషాలకు ఒక రైలు రావడం వలన  ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆ రైలు గేటు దాటడానికి ప్రజలకు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరమైన సమయాలలో వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పో వలసిన పరిస్థితి ఏర్పడుతున్నదని,


గత కొన్ని సంవత్సరాల నుండి ఈ గ్రామం మీదు గా అండర్ బ్రిడ్జి నిర్మించి పాణ్యం నియోజకవర్గంలో  రైల్వే జంక్షన్ ఏర్పాటు చేసి, స్టేషన్లో ప్రతి రైలు ఆగేటట్లు చూడాలని,రైలు వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా మైకుల ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ  రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు వనం వెంకటాద్రి, బత్తినప్రతాప్, రియాజ్ లు రైల్వే సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు .

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: