తినండీ ప్రశ్నించకండీ అంటున్న..

టూరిస్ట్ హోటల్ లైసెన్స్ రద్దుచేసి, హోటల్ ను సీజ్ చేయండి

జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన....యువజన, విద్యార్ధి, ప్రజా సంఘాల నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని టూరిస్ట్ హోటల్లో ఇడ్లీ-సాంబార్ లో పడిన బల్లి సంఘటనలో కస్టమర్లకు ఇంత నిర్లక్ష్యంగా వడ్డించడం ఏమని అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే బల్లే కదా పడింది పిల్లి కాదు కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ,మీ ధర్నాలు చాలా చూశాం.ఒకరోజు లేదా రెండు రోజులు చేస్తారని ఆ తర్వాత శరామాములేనని ఎవరైతే మాకేంటీ.! ఎవరు ఏం చేస్తారు,


ఎవరికి ముడుపులు ఇవ్వాలో ఇవ్వాల్సింది వారికిచ్చాం. మమ్మల్ని ఎవరేం చేస్తారని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని నేతలు రామినేని రాజునాయుడు , ధనుంజయుడు , జయరాజు , శివకృష్ణ యాదవ్ , రవీంద్ర నాయక్ , ఎర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని టూరిస్ట్ హోటల్ కు వత్తాసు పలుకుతూ హోటల్ ఇండ్లీ - సాంబారు పడిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకుండా టూరిస్ట్ యూజమాన్య హోటల్ కు వత్తాసు పలుకుతూ కేవలం పది రోజులు మాత్రమే రద్దు చేసి ఆ హోటల్ యాజమాన్యం ఇచ్చిన ముడుపులు తీసుకుని వారికి వత్తాసు పలుకుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు శేఖర్ రెడ్డి కుర్మా నాయకులు అన్వర్ బేగ్ లను వెంటనే సస్పెండ్ చేసి,నంద్యాల టూరిస్ట్ హోటల్ లైసెన్స్ రద్దు చేసి , యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ యువజన , విద్యార్థి , ప్రజా సంఘాల ఆధ్వరంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నేతలు రామినేని రాజునాయుడు , ధనుంజయుడు , జయరాజు , పెరుగు శివకృష్ణ యాదవ్, రవీంద్ర నాయక్, ఎర్రిస్వామి మాట్లాడుతూ తక్షణమే టూరిస్ట్ హోటల్ గుర్తింపును రద్దు చేయాలని, లేకపోతే శనివారం రోజున టూరిస్ట్ హోటల్ ఎదుట నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: