వెలుగోడు తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయంలో.... 

విధులకు హాజరు కాని ఉద్యోగులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండల కేంద్రం నందు గల తెలుగు గంగ(రిజర్వాయర్) ప్రాజెక్ట్ ప్రభుత్వ కార్యాలయం నందు విధులు నిర్వహించాల్సిన కార్యాలయ సిబ్బంది గురువారం ఉదయం 11.45 గం.ల సమయమైన ఒక్కరు కూడా విధుల్లో హాజరు కాలేదు, కార్యాలయంలో కుర్చీలు ఖాలీగా దర్శనం ఇచ్చాయి. టి జి పి కార్యాలయంలో ఒకరు ఇద్దరు కింది స్థాయి సిబ్బంది(అటెండర్)లు మాత్రం ఉండటం గమనార్హం.వెలుగోడు మండలంలో ఉన్న టి జి పి కార్యాలయం నకు అను సందానంగా 4 సబ్ డివిజన్ ఇరిగేషన్ ప్రాజెక్టు (టి జి పి)కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం.


ఒకటో నెంబర్ సబ్ డివిజన్ టి జి పి కార్యాలయం 1 కి తప్ప మిగతా 3 సబ్ డివిజన్ టి జి పి కార్యాలయం లకు కనీసం గుర్తింపు బోర్డులు లేవని కార్యాలయం సిబ్బందని అడుగగా సమాధానం చెప్పకుండా పొంతన లేని సమాధానాలు చెప్తూ దాటవేస్తున్నారు.జిల్లా కలెక్టర్,ఉన్నత స్థాయి అధికారులు,ప్రజా ప్రతనిధులు సచివాలయా లు,రెవెన్యూ కార్యాలయాలు,ప్రభుత్వ కార్యాలయాల మీద పెట్టిన దృష్టి  టి జి పి ప్రభుత్వ కార్యాలయాలపై కూడా దృష్టి పెట్టి,సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా సమయ పాలన పాటించే విధంగా సంబంధిత ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: