గడివేముల మండలంలో
ముగిసిన గ్రామాభివృద్ధి ప్రణాళిక శిక్షణా తరగతులు
(జానో జాగోో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఈవోఆర్డి ఖాలిక్ బాషా, ఎంపీపీ నాగమద్దమ్మల అధ్యక్షతన గ్రామాభివృద్ధి ప్రణాళిక 2022-23 శిక్షణ తరగతులను 13వ తేదీ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి,జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు గ్రామాల అభివృద్ధికి చేయవలసిన పనులను క్లుప్తంగా వివరించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో గ్రామంలోని అధికారులు,ప్రజా ప్రతినిదులందరూ భాగస్వాములై సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మండల స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు తీవ్ర ఒత్తిడి లకు లోనుకాకుండా, మానసికంగా,శారీరకంగా ద్రుడ సంకల్పంతో ఉండటానికి హార్ట్ పెయిన్ లెస్ సంస్థ అరవింద రాణి గారి చే మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ శిక్షణ తరగతులకు గడివేముల మండల స్థాయి అధికారులు ఎంపీడీవో, ఈఓఆర్డి,ఎమ్మార్వో, ఎంఈఓ,మెడికల్ ఆఫీసర్, ఐసిడిఎస్ అధికారులు, ఎపిఓ మేనేజర్లు,ఏపిఎం వైకెపి,మండల వ్యవసాయ అధికారి,పశు వైద్య అధికారి,ఏఈఆర్డబ్ల్యూఎస్, జల జీవన్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ సభ్యులు,ఏపీ ఎస్పీడీసీఎల్ ఏఈ,అన్ని గ్రామ సచివాలయాల పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు,ఇంజనీర్ అసిస్టెంట్లు,వెల్ఫేర్ అసిస్టెంట్లు,డిజిటల్ అసిస్టెంట్ మరియు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ,జెడ్పిటిసి సభ్యులు,కో అప్డేట్ సభ్యులు పాల్గొన్నారు.
Home
Unlabelled
గడివేముల మండలంలో,,, ముగిసిన గ్రామాభివృద్ధి ప్రణాళిక శిక్షణా తరగతులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: