తెలంగాణ వచ్చింది ఏం చేశారు అన్న వారికి,,,
కేసీఆర్ పథకాలే సమాధానం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్ లో జరిగిన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు ఆత్మగౌరవంతో ఉండేలా మిషన్ భగీరథ ద్వారా కృషి చేసారన్నారు. సామాజిక కోణంలో ఆలోచించి కళ్యాణాలక్ష్మి, షాది ముబారాక్ పథకాలు తీసుకువచ్చారని, తద్వారా నేడు బాల్య వివాహాలు ఆగిపోయాయని, ఉన్నత విద్యలో యూనివర్సిటీలలో అమ్మాయిల శాతం పెరిగిపోయిందన్నారు.
మహేశ్వరం నియోజకవర్గలో ఈ పథకం కింద ఇప్పటివరకు 16,500 మంది దరఖాస్తు చేసుకోగా 14 వేల మందికి 140 కోట్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. మిగతా వారి దరఖాస్తులు కూడా వివిధ దశల్లో ఉన్నాయని, వారికి కూడా ఈ పథకం కింద లబ్ది చేకూరుతుందన్నారు. తెలంగాణ వచ్చింది ఎం చేసారు అనే వాళ్లకు ఇది ఒక నిదర్శనం అన్నారు. ప్రజల కోసం అనునిత్యం పనిచేసే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
Home
Unlabelled
తెలంగాణ వచ్చింది ఏం చేశారు అన్న వారికి,,, కేసీఆర్ పథకాలే సమాధానం,,, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: