ఉచిత కుట్టు శిక్షణలో,,

మహిళలు వారి జీవన నైపుణ్యాలను పెంచుకోవాలి

ఎస్.షర్ఫద్దీన్ అలీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజక వర్గంలోని పాములపాడులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అండ్ అఫైర్స్ నెహ్రూ యువ కేంద్రం వారి సహకారంతో సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ఉచిత కుట్టు శిక్షణలో మహిళలు చేరి వారి జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని సంస్థ అధ్యక్షుడు ఎస్.షర్ఫద్దీన్ అలీ అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి ఆ పైన వయసు కలిగిన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకరి మీద ఆధారపడకుండా స్వయంగా జీవించవచ్చుని,


పాములపాడులోని చెలిమిళ్ళ రస్తాలో డిసెంబర్ నెల-2022 నుండి మార్చి-2023 వరకు జరుగుతున్న ఉచిత టైలరింగ్,ఎంబ్రాయిడరీ, వైర్ బుట్టల అల్లకం వంటి స్వయం ఉపాధి శిక్షణలలో ఇస్తామని,రెండు పోస్ట్ ఫోటోలు,బయోడేటా, ఆధార్ కార్డు,రేషన్ కార్డు, వున్నవారు,చదువుకున్న సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే వాటి జిరాక్స్ కాపీలతో వచ్చి చేరి వారి జీవితాలలో వెలుగు నింపుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సేవా భారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయం,కేజీ రోడ్డు,పాములపాడు నందు స్వయంగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.సెల్ నెంబర్స్- 9573318022, 8247725579 ఫోన్ చేసి తెలుసుకోవాలని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: