సాయి పల్లవి బాలీవుడ్ బాట

డ్యాన్సర్ గా మెప్పించి హీరోయిన్ అయిన నటి సాయి పల్లవి. టాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు ఆమె చేరువైంది. సాయి పల్లవి సినిమాలు అంటే ఏదో ప్రత్యేకత ఉంటుందన్న పేరు వచ్చింది. ఆమె చిత్రాల కోసం అంతా ఎదురుచూస్తుంటారు. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది సాయిపల్లవి. దక్షిణాదిలో మెప్పించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. అది కూడా ఓ పౌరాణిక చిత్రంతో కావడం విశేషం. 

రణ్ బీర్‌ కపూర్‌ హీరోగా రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. ఇందులో రాముడిగా రణ్ బీర్‌ కనిపించనున్నారు. రావణుడి పాత్రను హృతిక్ రోషన్ పోషించనున్నారు. తెలుగు వారైన మధు మంతెన నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో సీత పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు గతంలో దీపిక పదుకొణె, కరీనా కపూర్‌‌ పేర్లు వినిపించాయి. ఇప్పుడు సాయిపల్లవిని ఖారారు చేశారనే వార్తలు వస్తున్నాయి. నటనకు, అభినయానికి ప్రాధాన్యత వున్న ఈ పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేస్తుందని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటిన రావాల్సి ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: