సేవాలాల్ గుడి వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న బుక్క వేణుగోపాల్
ఘన స్వాగతం పలికిన అల్లికోల్ తాండ గ్రామ వాసులు
ఎపుడొచ్చిన ఇంటిబిడ్డలా పిలిచే మీ ఆప్యాయత మరవలేనిది: బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండల అల్లికోల్ తాండ గ్రామంలో జరుగుతున్న సేవాలాల్ గుడి వార్షికోత్సవ ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, జుక్కల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. వీరిని అల్లికోల్ తాండ గ్రామవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, జుక్కల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ అల్లికోల్ తాండ ప్రజలు తాను ఎప్పుడు వచ్చిన ఎంతో ఆప్యాంగా సొంత ఇంటి బిడ్డలాగ పలుకరిస్తారన్నారు. మీ ప్రేమ ఎల్లపుడు తనపై ఉండాలని ఇలాగే ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ రాజు నాయక్, వార్డ్ సభ్యులు, అల్లికోల్ తాండ గ్రామస్థులు, యువకులు బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: