రజినీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన బాబు

దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. డిసెంబరు 12న ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 72వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న రజనీకాంత్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

డియర్ ఫ్రెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. రజనీకాంత్ ప్రాభవం ఇలాగే కొనసాగాలని, ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు తాను గతంలో రజనీకాంత్ ను కలిసినప్పటి చిత్రాన్ని పంచుకున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: