ప్రజల భద్రతే మాకు ముఖ్యం
అందుకే ట్రాఫిక్ నిబంధనలు కఠినం
ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఏ మాత్రంలేదు
ఈ విషయం ప్రజలు అర్థంచేసుకొని సహకరించాలి
వాహనాలతో మైనర్లు రోడెక్కితే మాత్రం యజమానిపై చర్యలు తీసుకొంటాం
చార్మినార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కే.ఎస్.రవి
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, వారి కోసమే ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారని చార్మినార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కే.ఎస్.రవి వెల్లడించారు. ఈ విషయాన్ని సరైన కోణంలో ప్రజలు కూడా అర్థంచేసుకోవాలని ఆయన కోరారు. ట్రాఫిక్ రూల్స్ ముఖ్యఉద్దేశంను ప్రజలు అర్థంచేసుకొని ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించడంతోెపాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నంకాకుండా ఉంటాయన్నారు. ఇందుకోసం రాంగ్ రూట్ డ్రైవింగ్ పై రూ. 1700, ట్రిపుల్ డ్రైవింగ్ పై రూ.1200 చలానా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రెండు రకాల డ్రైవింగ్ ల వల్లే రోడు ప్రమాదాలు, ప్రాణనష్టం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడానికే ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశామని ఆయన వెల్లడించారు. ఈ వాస్తవాన్ని అర్థంచేసుకొంటేనే ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడంయోక్క ముఖ్య ఉద్దేశం అర్తంచేసుకొంటారని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ పై నిరంతరం ప్రజల్లో అవగాహన చేపడుతున్నామన్నారు. మదీనా, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ఫ్లెక్సీలు కూడా వేశామని ఆయన తెలిపారు.
ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడకుండా వాహనదార్లు సుఖాంతంగా ప్రయాణించేందుకు రోప్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం పట్టిష్టంగా అమలు చేయడంతోపాటు వాహనదార్లు స్టాప్ లైన్ వద్దే సిగ్నల్స్ వద్ద నిలబడేలా, జిబ్రా లైన్ లో పాదాచారులు వెళ్లేలా నిబంధనలను కచ్చితంగా అమలుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. తద్వారా రోడ్డును దాటే క్రమంలో ప్రమాదాలు కూడా తగ్గించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన తెలిపారు. మరోవైపు రోడ్డును ఎవరైనా వ్యాపారులు ఆక్రమిస్తే వాటిపై కూడా చర్యలు తీసుకొంటున్నామన్నారు. మైనర్లు రోడ్డుపైకి వాహనాలతో వచ్చి ఎవరినైనా ఢీకొట్టిి ప్రాణాలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదన్నారు. అందుకే మైనర్లు ఎవరైనా వాహనం తీసుకొని రోడ్డెక్కితే మాత్రం ఆ వాహన యజమానిపై చర్యలు తీసుకొంటామన్నారు. పాదాచారులు కూడా రోడ్డుపక్కనున్న ఫుట్ పాత్ లను పూర్తిస్తాయిలో వినియోగంలోకి తీసుకోవాలన్నారు. అందుకు అనువైన వాతావరణం ఫుట్ పాత్ లపై కల్పించేందుకు, ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించేందుకు తాము జీహెచ్ఎంసీ అధికార్ల సహాయం కూడా తీసుకొంటున్నామన్నారు. ప్రజలు ఈ వాస్తవాన్ని అర్థంచేసుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని చార్మినార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కే.ఎస్.రవి ఈ సందర్భంగా కోరారు.
Home
Unlabelled
ప్రజల భద్రతే మాకు ముఖ్యం,,,,చార్మినార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కే.ఎస్.రవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: