సామాన్యుడి ఇంటికి,,,కరెంట్ బిల్లు అక్షరాల రూ.5 లక్షలు

విద్యుత్ శాఖ లీలను వింటే అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు.  ఓ సామాన్యుడు నివసించే ఇంటికి నెలకు కరెంట్ బిల్లు ఎంతోస్తుంది ?. రెండు లైట్లు, ఫ్యాన్, టీవీ వాడితే నెలకు రూ.400 వందల నుంచి రూ.600 రావొచ్చు. ఇక ఫ్రిజ్, మిక్సీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే ఇంకో రూ.300 వందలు అదనం. అంటే ఎలా చూసుకున్న రూ. 800 నుంచి రూ.1000కి మించదు. కానీ ఓ సామాన్యుడి ఇంటికి నెల కరెంట్ బిల్లు అక్షరాల రూ.5 లక్షలు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి కరెంట్ తీగ పట్టుకోకుండానే బిల్లు చూసి షాక్‌కు గురయ్యాడు.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎం.యడవల్లి గ్రామానికి చెందిన కొప్పు రాము అనే వ్యక్తి ఇంటికి విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లు రీడింగ్ తీశారు. రీడింగ్‌లో ఆయనకు రూ.5 లక్షల బిల్లు వచ్చినట్లుగా అధికారులు ఆయన చేతిలో బిల్లుపై పెట్టారు. దీనిపై వినియోగదారుడు అధికారులను ప్రశ్నించారు. తన ఇంటికి ప్రతి నెల రూ.800 నుంచి రూ.1200 వందలు మాత్రమే బిల్లు వస్తుందని ఈసారి రూ. 5 లక్షలు రావటమేంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు.. మీటర్‌లో సాంకేతిక లోపం వల్ల బిల్లు వచ్చిందని త్వరలోనే కొత్త మీటరు పెడతామని చెప్పారన్నారు. తన ఇంట్లోని మూడు నెలలుగా పని చేయటం లేదని.., దీనిపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవటం లేదని వాపోయాడు. కూలీనాలీ చేసుకునే బ్రతికే తమకు రూ. 5 లక్షల కరెంట్ బిల్లు వస్తే ఎలా కట్టగలమని ఆవేదన వ్యక్తం చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: