జీవో నెంబర్ 174 ను రద్దు చేయాలి
ఏపీ రైతు సంఘం డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నిరుపేదల పెన్షన్లకు ఆటంకం కలిగించే జీవో నెంబర్ 174 ను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని స్థానిక నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలోని అల్లూరు రోడ్డు చాకలిపేటలో ఉన్న.7 వ సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ నామతుల్లా కి, మహిళా పోలీస్ ఆఫీసర్ లావణ్య కి ఏపీ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నేను ఉన్నాను నేను విన్నాను నేను ముఖ్యమంత్రిని అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత రెండు సంవత్సరముల నుండి సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న వృద్దులు, వితంతువులు, వికలాంగులు,ఒంటరి మహిళలు, చేనేత, మత్స్య కారులకు, డయాలసిస్, హిజ్రాల పెన్షన్లకు ఆటంకాలు కలిగే విధంగా జీవో నెంబర్ 174 తీసుకువచ్చి పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు, ముఖ్యమంత్రి మున్సిపాలిటీల్లో 300 విద్యుత్తు యూనిట్లు కాలిన వెయ్యి చదరపు అడుగుల ఇంటిలో నివాసం ఉన్న వారందరికీ సచివాలయాల ద్వారా నోటీసులు పంపించి పెన్షన్ రద్దు చేస్తామని. చెప్పడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 174 ను తక్షణమే రద్దు చేయాలని, 2011లో నందికొట్కూరు మున్సిపాలిటీ ఏర్పాటు అయినా ఎటువంటి అభివృద్ధి జరగలేదనీ,
కేవలం ప్రజల పైన ఇంటి పన్నులు, విద్యుత్తు, చెత్త పన్ను. నీటి పన్నులు మాత్రమే పెరిగాయని, పట్టణంలో ఎటువంటి పరిశ్రమలు గానీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పట్టణంలో ఉపాధి హామీ పనులు కూడా లేకపోవడంతో కూలీలు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు, మధ్య తరగతి ప్రజలు, భవన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారనీ, కుటుంబంలోభర్తలు చనిపోయిన వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు ఆసరాగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ తొలగిస్తే వారి జీవనం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. తక్షణమే పేదల పెన్షన్లకు నష్టం కలిగించే జీవో174 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో రద్దు చేయకపోతే పెన్షన్ దారులతో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నారాయణ, మధుబా బు, కృష్ణుడు,సిఐటియు మండల కార్యదర్శి నాగన్న, మహిళా సంఘం నాయకురాలు బేబీ, నాగలక్షమ్మ, లక్ష్మీదేవి, లక్షమ్మ, రజియా తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
జీవో నెంబర్ 174 ను రద్దు చేయాలి,,,,ఏపీ రైతు సంఘం డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: