ప్రజల వద్దకే104 సేవలు 

గడివేముల మండల వైద్యాధికారిని డాక్టర్ జబీన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామంలో ప్రజల వద్దకే 104 సేవల లో భాగంగా ఉదయం నుండి రక్తహీనత కలిగిన చిన్న పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు అవసరం అయిన పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన వైద్య సేవలు అందించారు.అనంతరం మధ్యాహ్నం నుండి కాళ్లు చేతులు సచ్చువచ్చి (పక్షవాతం)నడవలేని వారు మరియు వయసు మీద పడి నడవలేని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పరీక్షించి వారికి కావలసిన పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.


ఈ సందర్భంగా గడివేముల మండల వైద్యాధికారిని డాక్టర్ జబీన్ మాట్లాడుతూ గడివేముల మండలంలోని ప్రతి గ్రామంలో రెండు రోజులపాటు వైద్య సేవలు అందిస్తామని,గడివేముల ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటలు వైద్య సేవలకు అందుబాటులో ఉంటుందని,అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుకోవాలని ప్రజలకు సేవ చేయడానికి గడివేముల వైద్య సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల వైద్యాధికారిని డాక్టర్ జబిన్, వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: