పాణ్యం 1 & 4 గ్రామ సచివాలయాల్లో

దొంగలు పడ్డారు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక పాణ్యం గ్రామంలో 1 మరియు 4 సచివాలయాల్లో దొంగలు పడ్డారు.వివరాల్లోకి వెళితే పాణ్యం గ్రామంలోని ఒకటి మరియు నాలుగు సచివాలయాల తాళాలను పగలగొట్టి సచివాలయాలలో ప్రవేశించి ప్రజలకు సంబంధించి ఆన్లైన్ కు సంబంధించి కంప్యూటర్తో కనెక్ట్ అయిన వైరును తప్పించి, ప్రజలకు సంబంధించిన రేషన్ కార్డు మరియు పింఛన్లకు సంబంధించిన ఫైళ్లను గుర్తు తెలియని ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం సచివాలయానికి వచ్చిన సిబ్బంది పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం అందివ్వడంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి భరత్ ఆధ్వర్యంలో క్లూస్ టీం రంగంలో దిగి నమూనాలను, సచివాలయ సిబ్బందిని ఎంక్వయిరీ ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ దుండగుల నమూనాలను సేకరిస్తున్నామని, జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: