సచివాలయాలను తనిఖీ చేసిన..,

నంద్యాల జిల్లా డి.ఎల్.డి.ఓ. జనార్ధన రావు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని గడివేముల సచివాలయం 1, దుర్వేసి సచివాలయాలను నంద్యాల జిల్లా డి.ఎల్.డి.ఓ  జనార్ధన్ రావు తనిఖీ నిర్వహించారు. స్థానిక మండల ఎంపీడీవో కార్యాలయం లో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తప్పకుండా తెలియజేసే విధంగా విధులు నిర్వహించాలని, వారంలో మూడుసార్లు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని తెలిపారు.అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయాల నిర్వహణ పూర్తి బాధ్యత సచివాలయ సిబ్బంది దే అని, సచివాలయ సిబ్బంది తప్పకుండా అన్ని శాఖల సిబ్బంది తో కలసి పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, ఆయుష్మాన్ భారత్ ఈ కేవైసీ వాలంటీర్స్ ద్వారా పూర్తి చేయించాలని,



సచివాలయ సిబ్బంది అందరూ తప్పకుండా టైం కి బయోమెట్రిక్ అటెండెన్స్ వెయ్యాలని, స్పందన కార్యక్రమం మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంకాలం 05:00 గంటల వరకు తప్పక నిర్వహించాలని ఆదేశించారు.హౌసింగ్ డి.ఇ.ఇ సుబ్బారెడ్డి మాట్లాడుతూ PMAY గ్రామీణ క్రింద గడివేముల మండలంలో 383 ఇళ్లు మంజూరు అయ్యాయని , 347 ఇల్లు రిజిస్ట్రేషన్ లు అయ్యాయని, 311 ఇళ్ళు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు జియో ట్యాగింగ్ చేశారని తెలిపారు. గడివేముల మండలం లో "KUDA" క్రింద ఇళ్ళు మంజూరు అయ్యాయని,డిసెంబరు 01-12-22 వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని, గ్రౌండింగ్ కు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయసింహారెడ్డి, EORD ఖాలిక్ భాష , హౌసింగ్ ఏఈ అన్వర్ భాష, గడివేముల మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, దుర్వేసి సర్పంచ్ మమత పాల్గొన్నారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: