గుడ్ షెప్పర్డ్ స్కూల్, కార్పొరేట్ పాఠశాలలకు రేపు బంద్ కు పిలుపునిచ్చిన.. 

రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని గుడ్ షెఫర్డ్ హైస్కూల్ నందు అభం శుభం తెలియని 5 వ తరగతి విద్యార్ధి వశీకర్ పాఠశాల వేధింపులు - టీచర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోన్నాడని, గుడ్ షెప్పర్డ్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  26-11-22 వ తేదీన గుడ్ షెఫర్డ్ హై స్కూల్, కార్పొరేట్ పాఠశాలల  బంద్ కు పిలుపునిచ్చిన  రాయలసీమ విద్యార్థి, యువజన సంఘల జేఏసీ నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న వశీకర్ అనే విద్యార్ధి పాఠశాల సిబ్బందీ , టీచర్ల వేధింపులు తాళలేక ,  తీవ్ర ఒత్తిడికి లోనై 24-11-22 వ తేదీ ఉదయం ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం జరిగిందనీ దీనికి నిరసనగా శనివారం నంద్యాలలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలలకు బంద్ కు పిలుపుని తెలిపారు.


ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్ రాజునాయుడు , వైస్ చైర్మన్ బందెల ఓబులేసు , కన్వీనర్లు పూల వెంకట్ , వేణు మాధవ రెడ్డి , జయరాజు , సీనియర్ విద్యార్ధి , యువజన నేత పెరుగు శివకృష్ణ యాదవ్ లు మాట్లాడుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా గుడ్ షెప్పర్డ్ పాఠశాల యాజమాన్యం ప్రవర్తిస్తుందనీ , చదువుల పేరుతో విద్యార్ధులను మానసికంగా హింస పెడుతూ , ర్యాంకుల పేరుతో పసిహృదయాలను రక్తం పీల్చుతూ పేట్రేగిపోతున్నారని, అభం శుభం తెలియని వశీకర్ (12) 5వ తరగతి విద్యార్ధి నాలుగవ అంతస్ధు నుండి ఆత్మహత్యా ప్రయత్నం సిగ్గుచేటన్నారు. రాజకీయ పలుకుబడితో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం  సమంజసం కాదని తెలిపారు.a

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: