పిన్నాపురం గ్రామ రైతులకు కూలీలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం
సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శిపెనుమల్లి మధు
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పిన్నాపురం గ్రామ రైతులకు వ్యవసాయ కూలీలకు 15 రోజుల్లో న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన మాజీ రాజ్యసభ సభ్యులు,సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో రైతులతో చర్చించిన అనంతరం గ్రీన్ కో కంపెనీ నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడానికి వెళ్లడం తో అక్కడ పోలీసులు సిపిఎం పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడంతో దాదాపు రెండు గంటల పాటు అక్కడే బైఠాయించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేంత వరకు రైతులకు, కూలీలకు న్యాయం చేసేంతవరకు వెళ్ళేది లేదని
బైఠాయించడంతో ఏజీఎం వచ్చి 15 రోజుల్లో మీరు చెప్పినట్లుగా అన్ని రకాల సమస్యలను మా కంపెనీ పరిశీలించి పరిష్కార మార్గం చూపెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి ,జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా నాయకులు నాగరాజు, సద్దాం హుస్సేన్ ,నరసింహ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సుధాకర్, సిఐటియు జిల్లా నాయకులు బాల వెంకట్,సిఐటియు నంద్యాల పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
పిన్నాపురం గ్రామ రైతులకు కూలీలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం,,, సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శిపెనుమల్లి మధు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: