హాస్టల్ విద్యార్థులకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి

ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా  కార్యదర్శి ధనుంజయుడు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా లో ఉన్నటువంటి ఎస్టి,ఎస్సీ మరియు బిసి హాస్టల్ విద్యార్థులకు పెండింగులో ఉన్న హాస్టల్ విద్యార్థుల మెస్,కాస్మొటిక్ బిల్లులు తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యమబాట చేపడతామని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ,ఎస్టీ, బీసీ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ  సంక్షేమ హాస్టల్లో అమలులో ఉన్న 2018 మెనూ రద్దుచేసి పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా 2022 మెనూను తక్షణమే రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలని,ప్రస్తుతం 3 నుండి 5 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 1200,6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 1250, ఇంటర్ ఆపై స్థాయి విద్యార్థులకు 1400 డైట్ చార్జీలు ఉండగా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 3 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2500,ఇంటర్,ఆ పై స్థాయి విద్యార్థులకు 3000 డైట్ చార్జీలను పెంచాలని,హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేయాలని,వసతి గృహాలలో ఖాళీగా ఉన్నటువంటి వంటలు తయారు చేయువారిని,వాచ్మెన్ల పోస్టులను, వార్డెన్ల పోస్టులను భర్తీ చేయాలని,నాడు నేడు పథకం కింద వసతి గృహాలు అన్నింటిని కూడా అభివృద్ధి చేయాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 మెనూ అమలవుతున్న నేపథ్యంలో 2018 లో ఉన్నటువంటి మెనూ ధరలకు ప్రస్తుతం 2022 సంవత్సరానికి ఉన్నటువంటి మెనూ ప్రకారం నిత్యవసర ధరలకు చాలా వ్యత్యాసం ఉందని అప్పుడు ఉన్నటువంటి ధరల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు రెండింతలు పెరిగాయని


ఇప్పుడున్న నిత్యవసర ధరలకు "ఏమి కొనేటట్టు లేదు ఏమి తినేతట్టు లేదని" వార్డెన్లు 2018 మెనూ ప్రకారం వస్తున్న బిల్లులకు విద్యార్థులకు సక్రమంగా పౌష్టిక ఆహారం పెట్టడానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,2018 మెనూ అమలు అవుతున్నప్పటికీ విద్యార్థులకు అందించేటువంటి భోజనం నాణ్యత విషయంలో ఎటువంటి మార్పులు లేవని,విద్యార్థులకు పెట్టె భోజనం విషయంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించే విషయంలో నాణ్యత ఏమాత్రం ప్రభుత్వం  తగ్గలేదని, నాణ్యతకు తగినట్టుగా విద్యార్థులకు వార్డెన్లు భోజనాలు పెట్టాలంటే 2022 మెనూ తక్షణమే అమలు చేసి,పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్,కాస్మొటిక్ బిల్లులను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని,హాస్టల్ విద్యార్థులను కలుపుకొని విద్యార్థుల ఆకలి కేకలు  ప్రభుత్వానికి తెలిసే విధంగా ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి,నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పరమేష్,చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: