నందమూరి నగర్ లో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి

నంద్యాల సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్ లోని జండా మాన్ ఎదురుగా శివాలయం వెనుక భాగాన ఉన్న అన్ని రహదారులలో సీసీ రోడ్లు వేయాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీస గారికి వినతిపత్రం ను సిపిఐ పట్టణ కార్యదర్శి  ప్రసాద్, నందమూరి నగర్ కాలనీవాసులు అందజేశారు.


అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి  ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి నగర్ ఏర్పడి 40 సంవత్సరములు కావస్తున్నదనీ ఎంతో మంది కౌన్సిలర్లు.కమిషనర్లు.ఎమ్మెల్యే మంత్రులు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని ఇప్పటికీ మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే విధంగా బురద రోడ్లలో,పాములతో,తేళ్లతో,విషపురుగులతో,జీవిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నందమూరి నగర్ కాలనీవాసులు  పడుతున్న కష్టాలను మున్సిపల్ చైర్ పర్సన్ గారి దృష్టికి తీసుకుపోగా ఆమె స్పందిస్తూ అక్కడ పనులు మొదలైనవి కాంట్రాక్టర్ ఎందుకు మీ ప్రాంతంలో పనులు మొదలు పెట్టలేదని ఫోన్ ద్వారా కాంట్రాక్టును అడగగా మూడు రోజులలో పనులు మొదలు పెడతామని చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగిందని,  మూడు రోజులలో పని మొదలు పెడతారని హామీ ఇచ్చారనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నందమూరి నగర్ కాలనీవాసులు రత్నమ్మ, తాహిలేన్, సూరాజన్, లక్ష్మీబాయి, శంకరమ్మ భాయ్, ప్రమీల భాయ్, బాలు నాయక్, బహదూర్, దేవ నాయక్, గర్జ మహిలి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: