మేమెందుకు కుళ్ళాయి పన్నులు చెల్లించాలి

ప్రశ్నిస్తున్న నందమూరి నగర్ వాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్ లోని 38 వ వార్డు వీధిలోని ప్రజలు మంచినీటికి ఇబ్బందులకు గురి అవుతున్నారని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో  సిపిఐ పట్టణ కార్యదర్శి  ప్రసాద్,ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు,నందమూరి నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి హుస్సేన్,కాలనీవాసులు మన్ బాదుల్లా,అబ్దుల్ రహీం,సలీం,అబ్దుల్ కలాం లు కలిసి నంద్యాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి నగర్ ఏర్పడి దాదాపు 40 సంవత్సరములు అయినప్పటికీ నందమూరి నగర్ లోని 38 వార్డు ప్రజలు ఇప్పటికీ మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారని,


కుళాయిలకు నీరు సరఫరా లేదని,మంచినీరు కుళాయిలకు రావడంలేదని, కుళాయిలకు మంచినీరు వదిలే వారిని అడగగా పైపులు లీకేజీలు ఉన్నాయని సమాధానం చెబుతూ,వాటికి మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, కుళాయిలకు నీరు సరఫరా చేసేటప్పుడు బురదతో నీరు కలుషితమై కుళాయిలకు సరఫరా అవుతున్నాయని, బురద నీరు ప్రవహించే కుళాయిలకు మేమెందుకు పన్నులు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు వాటర్ వర్క్ డీఈ గారు ఇక్కడి సమస్యలను పరిష్కరించి కుళాయిలకు  కలుషితం లేని మంచినీటిని సరఫరా చేయాలని, సంబంధిత అధికారులు స్పందించకపోతే 38 వ వార్డు ప్రజలు ఎటువంటి పన్నులు చెల్లించమని చెబుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: