పార్టీలకు అతీతంగా గ్రామాలలోని ప్రజలకు న్యాయం చేయాలి

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల జిల్లా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశం ఎంపీడీవో విజయసింహారెడ్డి,ఎంపీపీ నాగ మద్దమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 73 వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సమావేశానికి హాజరైన అధికారులు అందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించి సర్వసభ్య సమావేశం ప్రారంభించారు.


ఈ సమావేశంలో చిందుకూరు సర్పంచి అనసూయమ్మ మాట్లాడుతూ పంచాయతీ అధికారాలు ఇంతవరకు తనకు అప్పచెప్పలేదని, ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, చనిపోయిన కొంతమంది వ్యక్తులు పేర్ల మీద ఇప్పటికి కూడా బిల్లులు మంజూరయ్యని,ఎస్సీ కాలనీలో ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని, గ్రామంలో బోర్లు చెడిపోయాయని చెబితే బోర్లు వేయడానికి వచ్చి సామాన్లు వెనక్కి తీసుకెళ్లారని, గ్రామంలో బోర్లు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు, వెటర్నరీ డాక్టర్ సాయి హరణి మాట్లాడుతూ  గ్రామాలలో లుంపి వైరస్ రాకుండా 3000 పశువులకు టీకాలు వేశామని, పశువుల్లో కృత్రిమ గర్భధారణ ద్వారా కేవలం ఆడదూడ్ల ను పుట్టించే ఆర్గాన్స్ ఈ నెల నుండి ప్రారంభిస్తున్నామని చెప్పారు.

అనంతరం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గడివేముల మండలం హుడా కింద గృహాలు మంజూరు అయ్యాయని,గ్రామంలోని నిరుపేదలందరికీ గృహాలు పార్టీలకు ఆతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా చూసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, పేద ప్రజలకు,రైతులకు అన్యాయం జరుగుతే సహించే ప్రసక్తే లేదని, ప్రతి గ్రామంలోని ప్రజలందరికి జగనన్న పథకాలు పార్టీలకతీతంగా అందిలా చూడాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తి లేదని చెప్పారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని, కేవలం ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతే 2014 లో జరిగిన చేదు అనుభవాలే మళ్లీ జరుగుతాయని,

అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో డిసెంబర్ 5 వ తేదీన న్యాయ రాజధాని కోసం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ప్రజలందరితో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి ఖాలిక్ భాష,గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు, గడివేముల మండల ఉపాధ్యక్షులు కాలు నాయక్,అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులందరూ, అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: