ఆన్లైన్ యాప్ లోన్ లపై అప్రమత్తంగా ఉండండి 

గడివేముల ఎస్సై బిటి.వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేలు మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య గ్రామ ప్రజలకు ఆన్లైన్ యాప్ ల వల్ల జరుగుతున్న మోసాల గురించి వివరించి చెబుతూ ఆన్లైన్ యాప్ లోన్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తమను తామే కాపాడుకోవచ్చునని, మైనర్ యువకులకు వాహనాలు నడిపేందుకు ద్విచక్ర వాహనాన్ని ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు, గ్రామంలో రాత్రి సమయంలో అనుమానంగా ఎవరు సంచరించిన పోలీసులకు తెలియజేయాలని,


సమాచారం అందిన వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమతమై గ్రామంలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా నివారించగలమని, గ్రామంలోని ప్రజలందరూ రాగద్వేషాలు లేకుండా అందరూ ఐకమత్యంతో ఉండడం వల్ల గ్రామానికి మంచి పేరు వస్తుందని, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, కలహాలకు దూరంగా ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈకార్యక్రమంలో బిలకలగూడూరు గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: