విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం...కరిమద్దేల గ్రామం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కరిమద్దేల గ్రామంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలలోకి వెళితే కరిమద్దేల గ్రామంలో నంద్యాలకు వెళ్ళు ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలు ఇంటి పైకప్పు భాగానికి వెళ్లడానికి వీలు లేకుండా  మెట్లమీద కరెంటు తీగలు ఉన్నాయని, పెసర వాయి, కరిమద్దేల గ్రామాలలో పనిచేసే విద్యుత్ అధికారులు మరియు సిబ్బంది అనునిత్యం ఈ ప్రధాన రహదారి వెంట నంద్యాలకు వెళుతూ విద్యుత్ తీగలను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని,


ఇంటి పైన ఉన్న తీగలను తొలగించండని ఎన్నోమార్లు అధికారులకు తెలిపామని,ఇంటి పైకి చిన్న పిల్లలు సైతం ఎక్కితే పిల్లలకు కూడా విద్యుత్ తీగలు అందే విధంగా ఉన్నాయని, పక్క రాష్ట్రాలలో గృహాల పైన వెళ్లిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయిన వారు చాలామంది ఉన్నారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత విద్యుత్ సిబ్బంది, అధికారుల పై ఉన్నా వారు  మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, గ్రామంలో ప్రతిరోజు కరెంటు సరఫరాలో నిరంతరాయంగా అవంతరాలు ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని,విద్యుత్ సిబ్బంది,అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, రాత్రిపూట మాత్రమే వేలగవలసిన వీధి విద్యుత్ దీపాలు నిరంతరాయంగా వెలుగుతూ ఉంటాయని,


పగలు వీధిదీపాలను ఆపివేయు విద్యుత్ సిబ్బంది మాత్రం కనబడరని, వీధి దీపాలు వెలుగుతున్నా విద్యుత్ సిబ్బంది మాత్రం చూసి చూడనట్టుగా వెళ్తుంటారని, గ్రామంలోని ప్రజలకు నీటిని సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలో ముళ్లపొదలతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తే గ్రామంలో విద్యుత్ సిబ్బంది పనితీరుకు, నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: