ఆలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిన ప్రాంతంలో మరమ్మత్తులు ఎప్పుడూ

పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు, టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలం, మిడుతూరు మండలం మధ్యలో ఉన్న అలగనూరు రిజర్వాయర్ కట్ట కృంగిన ప్రాంతాన్నిపాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు, టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి సందర్వించారు. ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ తాగు,సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని, వైసిపి ప్రభుత్వం వచ్చాక అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిన ప్రాంతంలో  మూడు సంవత్సరాలైనా ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్టే లేదని, రైతు ప్రభుత్వం అంటూ రైతులకు రైతు భరోసా కేంద్రాలలో ఇచ్చిన పత్తి విత్తనాలు పంట రాక, పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని,


ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చి నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, ఆయకట్టుకు వేసవిలో కడపకు తాగునీరు అందించే అలగనూరు రిజర్వాయర్ వైసిపి పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారిపోయిందని ఆరోపించారు. అలగనూరు వాటర్ స్కీమ్ అంటూ కొర్రపోలురు వద్ద రెండు కోట్ల ఖర్చుతో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి సోమాపురం, కొర్రపోలూరు, గడివేముల,ఆళ్లగడ్డ గ్రామాలకు నాసిరకం పైపుల వాడకంతో గ్రామాల ప్రజలకు పూర్తిగా నీరు అందకుండా పోయిందని, తాగు,సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు లేవంటూ పథకాలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.

కనీసం చిన్నపాటి నిధులు తో ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టులు పూర్తి చేయలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని, రిజర్వాయర్ లో నీరు లేక సన్న చిన్న కారు రైతులు పంటలు పండించుకునే పరిస్థితిలో కూడా లేరని, రజకుల కుటుంబాలు, మత్స్యకారుల 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయనిరహదారులు గుంతలు పడి వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న నిధులు మంజూరు చేసి రహదారులను బాగు చేసే పరిస్థితులలో కూడా ప్రభుత్వం లేదని, సంక్షేమ పథకాలు అంటూ కేవలం బటన్ నొక్కాడానికి మాత్రమే పరిమితమై సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలందరూ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  గడివేముల మండల కన్వీనర్లు, నాయకులు,కార్యకర్తలు మరియు మిడుతూరు మండలం కన్వీనర్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: