ఆ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్


సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. ఎన్టీఆర్ తో సుకుమార్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన సుకుమార్ వైపు నుంచి ఈ కథ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లడం జరిగింది.

అయితే ఇప్పుడు ఈ కథను ఎన్టీఆర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కొరటాల తరువాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్టు ముందుగానే ఫిక్స్ అయింది. దాంతో బుచ్చిబాబు ఇదే కథను చరణ్ కి వినిపించి ఆయనతో ఓకే అనిపించాడని అంటున్నారు. సుకుమర్ కి చరణ్ తోను మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆయన చరణ్ ను ఒప్పించాడని అంటున్నారు.

 డైరెక్ట్ చేసేది బుచ్చిబాబు అయినా, అవుట్ పుట్ విషయంలో సుకుమార్ హ్యాండ్ ఉంటుందనే ఉద్దేశంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు కేన్సిల్ కావడం కూడా చరణ్ ఈ సినిమా చేయడానికి మరో కారణమని అంటున్నారు. ఇంకా ఈ విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: