వైయస్సార్ ఆరోగ్య సేవలు వినియోగించుకోండి

పారుమంచాల గ్రామ సర్పంచ్ ప్రకాశం


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామంలో  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అవరణంలో డాక్టర్ యశస్వని మరియు డాక్టర్ చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న వైయస్సార్ హెల్త్ సర్వీస్ మొబైల్ మెడికల్ క్లీనింగ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ ప్రకాశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన అంబులెన్స్ సేవలు పారుమంచాల గ్రామంలో  నిర్వహిస్తున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరూ అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


ప్రతి నెల పారుమంచాల గ్రామంలో అంబులెన్స్ సేవలు రెండు రోజులు నిర్వహిస్తారని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ యశస్విని మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్యాల కు గురైన వెంటనే మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మరియు ఆశ కార్యకర్తలు,  నాయకులు రసూల్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కర్ణ, దుబాయ్ బాబు, పెద్దన్న, మద్దిలేటి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: