అర్ధరాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం
డబీర్ పుర లోని న్యూ మక్కా టిఫిన్ సెంటర్-జైలు శిక్ష విధించిన కోర్టు
నిబంధనల మేరకు వ్యాపార నిర్వహించుకోవాలని స్పష్టం చేసిన డబీర్ పుర ఇన్స్పెక్టర్ జి. కోటేశ్వరరావు
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
అర్ధరాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న డబీర్ పుర లోని న్యూ మక్కా టిఫిన్ సెంటర్ యజమానిని అరెస్టు చేయగా అతనికి కోర్టు జైలు శిక్ష విధించిందని డబీర్ పుర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. కోటేశ్వరరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు వ్యాపారం నిర్వహిస్తున్న డబీర్ పుర లోని న్యూ మక్కా టిఫిన్ సెంటర్ యజమాని అబ్ధుల్ రహ్మన్ ను అరెస్టు చేసి VI SPL MM Court నందు హాజరు పరచగా న్యాయమూర్తి ఎస్ లక్ష్మణ్ రావు అతడికి ఎనిమిది రోజులు సాధారణ రిమాండ్ విధించడం జరిగిందనీ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు సమయపాలన దాటాక వ్యాపారాలు నిర్వహించకూడదని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. లేనిపక్షంలో అరెస్టు వై శిక్షకు గురి కావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: