గొటబాయ రాజపక్సకు సమన్లు జారీ చేసిన దేశ సుప్రీంకోర్టు


శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... 2011లో జరిగిన ఒక హత్య కేసులో శ్రీలంక పొడుజన పెరమున పార్టీకి చెందిన దుమిండ సిల్వకు 2017లో కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, 2021లో అధ్యక్ష హోదాలో రాజపక్స ఆయనకు క్షమాభిక్ష పెట్టారు. 

అయితే, ఈ ఏడాది మేలో ఆ క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దుమిండను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు రాజపక్సకు సమన్లు జారీ చేసింది. ఆయనకు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న రాజపక్స కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. గత జులైలో రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ శ్రీలంకకు చేరుకున్నారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: