డ్రైనేజీ కంపు రోడ్డుపైనే కాదు... అధికార పార్టీపై కూడా

బీజేపీ సీనియర్ నాయకుడు బుక్కా వేణుగోపాల్ విమర్శ

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

ఉపర్‌పల్లిలో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ పూడికతీత సమస్య ప్రజా సంక్షేమం పట్ల అధికార పార్టీకి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని రాజేంద్ర నగర్ బీజేపీ సీనియర్ నాయకుడు బుక్కా వేణుగోపాల్ అన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుత కార్పొరేటర్, ఉప్పర్పల్లి ప్రజల సమస్యలు వినకుండా వారిని కెమెరా ముందు కించపరిచి మాట్లాడారు. ఉపర్‌పల్లి వాసులు సుమారు 15 ఏళ్లుగా డ్రైనేజీ పూడికతీత సమస్యను ఎదుర్కొంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన బీఆర్ఎస్ నాయకుడు ప్రకాష్ గౌడ్, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని బుక్క వేణుగోపాల్ గారు తన వేదన తెలిపాడు. 


ఇక్కడ విడ్డూరం ఏమిటంటే, బీఆర్ఎస్ రాజ్యం యొక్క యువరాజు, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్, అంతర్జాతీయ సమావేశాలలో హైదరాబాద్ యొక్క మౌలిక సదుపాయాల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు, కానీ సాధారణ డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించలేరు.

రాజేంద్ర నగర్ ప్రజలు రోడ్ పైనా ఉన్నా కంపు తో పాటు బీఆర్ఎస్ పార్టీ చేసే కంపు రాజకీయం తో విసిగిపోయారని బుక్కా వేణుగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ మరియు దాని నాయకులే రాష్ట్రానికి నిజమైన డ్రైనేజీ ముప్పు అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. సంస్కరించే బిజెపి పార్టీ ని ఎన్నుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కంపు ను తొలగించి, తమ ఇంటిని శుభ్రం చేయడానికి తెలంగాణ ప్రజాలు సిద్ధంగా ఉన్నారు అని బుక్కా వేణుగోపాల్ హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: