పుస్తక పఠనంతోనే విజ్ఞానం,..

గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గ్రంధాలయం నందు 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా  పుస్తక ప్రదర్శన కార్యక్రమం ను గ్రంథాలయాధికారి  వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో విజయసింహ రెడ్డి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయసింహ రెడ్డి  మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను చదివి విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతిరోజు ఒక గంట లైబ్రరీకి వచ్చి పుస్తకాల చదివే అలవాటు చేసుకోవాలని, పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాన సంపద పెరుగుతుందని తెలిపారు.


ఎంఈఓ రామకృష్ణుడు  మాట్లాడుతూ గ్రంథాలయం అంటే పుస్తకాల నిధి అని, జ్ఞాన సంపదను పెంపొందించుకునేందుకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయానికి వస్తే లభిస్తాయని, రామాయణము, మహాభారతం, పోటీ పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు సిద్ధం కావడానికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ఈఓఆర్డి ఖాలిక్ భాష మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా సమాజంలో, పెద్దల యందు,తల్లిదండ్రుల యందు ఏ విధంగా ముసులుకోవాలో, నడుచుకోవాలో తెలుసుకుంటారని, ప్రతి విద్యార్థిని,విద్యార్థి గ్రంథాలయంలో పుస్తక పఠనం చేయించే బాధ్యత ప్రతి తల్లిదండ్రికి ఉందని తెలిపారు. గ్రంథాలయ అధికారి వి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గడివేముల గ్రామంలోని కోర్రపోలూరు గ్రామానికి వెళ్ళు రహదారిలో ఎమ్మార్వో శ్రీనివాసులు ఐదు సెంట్ల స్థలాన్ని గ్రంథాలయ శాశ్విత భవనానికి కేటాయించారని, త్వరలోనే గ్రంథాలయ భవనాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రంధాలయ పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: