భారతదేశమంతా పాదయాత్ర చేస్తూ,,,
రక్తదాన ఆవశ్యకతను తెలియజేస్తూన్న.... ఢిల్లీ వాసి కిరణ్ వర్మ
కిరణ్ వర్మకు సంఘీభావం తెలిపిన నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సోసైటీ
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఢిల్లీ వాస్తవుడు కిరణ్ వర్మ రక్తదానం పైనా అవగాహన కలిగిస్తు గత 340 రోజుల నుండి పాదయాత్ర చేస్తూ 9,000 కీ.మీ పూర్తి చేశారని, పాదయాత్రలో భాగంగా కిరణ్ వర్మ నంద్యాలకు వచ్చారని సమాచారం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా సభ్యులు కిషోర్ వర్మ ను కలసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. నంద్యాలజిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ అనుమతి, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారిని అనురాధ గారి అనుమతితో నంద్యాలలో ఉన్న ప్రముఖ కళాశాలలో, పాఠశాలలలో దాదాపు 2000 మందికి పైగా రక్తదానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిరణ్ వర్మ మాట్లాడుతూ
డిసెంబర్ 2017 లో తాను రక్తదానం చేసిన ఒక పిల్లవాడికి మరోసారి రక్తం అవసరమైనపుడు రక్తదాతలు ఎవరు దొరకక చనిపోవడం జరిగిందని, మహానగరమైన ఢిల్లీలో కేవలం ఒక రక్తదాత దొరకక పిల్లవాడు అర్ధాంతరంగా చనిపోవడం కలిచివేసిందని, ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ పిల్లవాడికి రాకూడదు అనే ఉద్దేశంతో రక్తదానంపై అవగాహన కలిగించడం మొదలుపెట్టానని, భారతదేశంలో డిసెంబర్ 2025 సంవత్సరం నాటికి రక్త కొరత లేని సమాజం నిర్మించాలని, ఏ ఒక్కరు రక్తం దొరక్క చనిపోకూడదని దేశవ్యాప్తంగా రక్తదానం పై అవగాహన కల్పిస్తూ 21,000 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టానని,16-11-22 వ తేదీ నాటికి తొమ్మిది వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా సభ్యులు దాదాభాయ్ మరియు దివ్యనాథ్ లు పాల్గొన్నారు
Home
Unlabelled
భారతదేశమంతా పాదయాత్ర చేస్తూ,,, రక్తదాన ఆవశ్యకతను తెలియజేస్తూన్న.... ఢిల్లీ వాసి కిరణ్ వర్మ ,,,సంఘీభావం తెలిపిన నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సోసైటీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: