పుస్తకాల పఠణంతోనే జ్ఞాన సంపద
మాజీ ఎంపిటిసి దేశం సత్యనారాయణరెడ్డి
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గ్రంధాలయం నందు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంధాలయాల స్థాపనకు బాటలు వేసిన మహనీయుల చిత్రపటాలకు గడివేముల సర్పంచ్ రమణమ్మ, మాజీ ఎంపిటిసి దేశం సత్యనారాయణరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గడివేముల గ్రామ సర్పంచ్ రవణమ్మ మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారా ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. మాజీ ఎంపీటీసీ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను,అవసరాన్ని గుర్తించి గ్రంథాలయాల స్థాపనకు పాటుపడిన ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, గాడి చర్ల హరి సర్వోత్తమరావుల స్ఫూర్తిని కొనియాడారు. గ్రంధాలయాధికారి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా17-11-22 వ తేదీన (గురువారం) మండలంలోని హై స్కూల్ విద్యార్థిని,విద్యార్థులకు "చరవాణి ల వల్ల ఉపయోగాలు మరియు నష్టాలు".... "గ్రంథాలయాల వల్ల కలుగు ఉపయోగాలు" అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రంథాలయ పాఠకులు, గ్రంధాలయ సిబ్బంది,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పుస్తకాల పఠణంతోనే జ్ఞాన సంపద ,,, మాజీ ఎంపిటిసి దేశం సత్యనారాయణరెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: