బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రధానం చేసిన..
రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, నంద్యాలజిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం, విద్యాదినోత్సం, బాలల దినోత్సవం సందర్భంగా 11-11_22 వ తేదీన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నందు శాంతి-అభివృద్ధి అనే అంశంపై వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాసరచన పోటీలలో దాదాపు 30 స్కూళ్ళకు చెందిన 300 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని రాజేశ్వరికి మొదటి బహుమతి, గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థిని సాయి వర్షిత రెడ్డికి రెండవ బహుమతి,గురురాజా స్కూల్ విద్యార్థిని మహితకు మూడవ బహుమతిని, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్ సర్టిఫికెట్లను మరియు బహుమతులను అందజేశారు.
30 స్కూల్స్ కు సంబంధించిన విద్యార్థిని, విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి స్కూల్ టాపర్ కు రెడ్ క్రాస్ తరఫున ప్రశంశాపత్రాలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాలజిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి అనురాధ, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష,మద్దిలేటి, డిఎఫ్ఓ రాజునాయక్, వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Home
Unlabelled
బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రధానం చేసిన.. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, నంద్యాలజిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: