ప్రజాసంకల్ప యాత్రకు ఐదు వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా

కేక్ కట్ చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం లో "ప్రజాసంకల్ప యాత్ర" ప్రారంభించి నేటికి ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా...పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, శరీన్ నగర్ లో "దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి" విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కేక్ కటింగ్ చేసి నాయకులకు,కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించామని


,పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని,ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలను దగ్గర నుంచి చూసిన  జగనన్న ప్రజలందరికీ ఏ ఏ సంక్షేమ పథకాలు కావాలో వాటిని మేనిఫెస్టోలో ప్రకటించి,వాటిలో నేటికీ 95 శాతం నెరవేర్చిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని, ప్రజా ప్రతినిధులందరికీ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి పంపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలని, సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైన ఉంటే వారికి కూడా అందించాలని సూచించారని, కులం,మతం,ప్రాంతం తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేయాలన్నది  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని, పేద ప్రజల పక్షపాతి ముఖ్యమంత్రి శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.పిలుపు  నిచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హాజరైన ప్రతీ ఒక్కరికీ పేరు,పేరున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో...డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్లు...కాశపోగు జయరాముడు, సుదర్శన్ రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, దండు లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, ఎరుకల వెంకటేశ్వర్లు, వైజా బాలచంద్ర రెడ్డి, కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాసులు, కల్లూరు మండల జడ్పీటీసీ ఆల ప్రభాకర్ రెడ్డి, కల్లూరు మండల సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి, కర్నూలు డి.ఏ.ఏ.బి చైర్మన్ మహేశ్వర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సిసెల్ శివ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎద్దుల శివారెడ్డి ,పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిందకొండ కెవి.రమణారెడ్డి, పెద్దటేకూరు హనుమంతు రెడ్డి, గోపీనాథ్, పర్ల సుంకన్న, శంకర్ రెడ్డి, భీమ శంకర్ రెడ్డి, తిరుమలేశ్ గౌడ్, పెద్దన్న, హుస్సేన్ ఆలం, సాయి,  వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: