ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూలుకు రహదారి నిర్మించకుంటే నిరాహార దీక్షలకు దిగుతాం
హెచ్చరించిన రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కేంద్రం లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూల్ లకు రహదారి వేయకుంటే ప్రత్యక్ష నిరాహార దీక్షలకు దిగుతామని రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవో,కలెక్టర్ కార్యాలయంల ముందు ప్రత్యక్ష నిరాహార దీక్షలకు వచ్చే వారంలో శ్రీకారం చుడతామని హెచ్చరించారు. పాణ్యం లో గత పది సంవత్సరాల నుండి మోడల్ స్కూల్, కస్తూరిబాయి స్కూల్ కు రహదారి కోసం అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలతో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ధర్నాలు చేస్తే ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు ఎన్నోసార్లు ఏపీ మోడల్ స్కూల్ కేజీబీవీ స్కూల్ లను సందర్శించి రహదారి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీలకే పరిమితం చేశారని,
రహదారి ఏర్పాటు కోసం ఒక్క అధికారి కూడా స్పందించకపోవడంతో వచ్చే వారంలో కలెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకపోవడంతో నిరాహార దీక్షలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని, నిరాహార దీక్షకు ప్రజా సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూలుకు సిసి రోడ్డు వేయాలని పాణ్యం ఎమ్మార్వో మల్లికార్జున గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనం వెంకటాద్రి,శ్రీనివాసరావు, చిరంజీవి, వనం సుధాకర్, వనం వెంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూలుకు రహదారి నిర్మించకుంటే నిరాహార దీక్షలకు దిగుతాం,,, హెచ్చరించిన రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: