మునుగోడు ఓటర్లు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మునుగోడు ఓటర్లు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తూ చేస్తున్న అరాచక రాజకీయాలకు చరమగీతం పాడేలా తీర్పు ఇచ్చారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా కావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి పోటీచేసిన మొదటి ఎన్నికల్లో అనుకూలంగా తీర్పు ఇచ్చిన మునుగోడు ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మంత్రి ఇంచార్జ్ గా పనిచేసిన పసునూరు,చెల్లవాణి కుంట,నామ్ నాయక్ తండా ప్రజలందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో మునుగోడు గెలుపు మరింత అండగా సమరోత్సాహం అందిస్తుందని అన్నారు.ఎంతో కీలకం అయిన ఎన్నికల్లో మునుగోడు ప్రజలు ఎంతో తెలివితో ఇచ్చిన తీర్పు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని,ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పని చేస్తారని అన్నారు.


పసునూరు ఎంపీటీసీ స్థానంలో 332 ఓట్ల మెజార్టీ రావటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ఓటర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.ప్రచారంలో ముందున్న స్థానిక ప్రజాప్రతినిధులకు,టి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు కార్యకర్తలకు, మంత్రి ధన్యవాదాలు తెలిపారు.అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కూడా మంత్రి సబితా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: