ప్రధాని  ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు  లక్ష్మీ నరసింహ యాదవ్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

ప్రధాని  ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు  లక్ష్మీ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నంద్యాల స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా ఆదుకున్నాం అని చెప్పడానికి వస్తున్నారా... పార్లమెంటులో విభజన చట్టంలో   పొందుపరిచిన అంశాలను నెరవేర్చామని వస్తున్నారా...  కర్నూలులో న్యాయ   రాజధాని   అని చెప్పడానికి వస్తున్నారా...  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కష్టించి ప్రాణ త్యాగాల అనంతరం వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటికరణ చేయను అని చెప్పడానికి వస్తున్నారా... రాయలసీమకు ఉత్తరాంధ్రకు   ప్రత్యేక ప్యాకేజీ పూర్తిస్థాయిలో అమలు చేశామని వస్తున్నారా... విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడానికి వస్తున్నారా... రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పి రాష్ట్రానికి రావాలని లక్ష్మీ నరసింహ యాదవ్   డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నష్టపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ ప్రతి బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపిస్తూ రాష్ర్టానికి అన్యాయం చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హెూదా, విభజన హామీలు నెరవేరుస్తానని చెప్పారన్నారు.


ప్రత్యేక హెూదా సాధించి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చి నేడు కేంద్రం ముందు జగన్ తల వంచారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా మన డిమాండ్లను సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ కనీసం ప్రస్తావించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలను, నిరుద్యోగులను అన్యాయం చేశారన్నారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పేట్ పరుస్తూ ఆహ్వానం పలుకుతున్నారని, నరేంద్ర మోడీ, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి రాష్ట్రానికి వస్తుంటే వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం. లక్షలాది ప్రజలను సభకు తరలించే బాధ్యతలు తీసుకోవడం హాస్యాసదంగా ఉందని, రాష్ట్రానికి రావలసిన విభజన హామీలను ప్రశ్నించకుండా నరేంద్ర మోదీకి ఆహ్వానం పలుకుతున్నారని, రాష్ట్ర ప్రజలు అందరూ  గమనిస్తున్నారని, రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని,కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదాపై ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయం చేస్తామంటూ మనకోసం అహర్నిశలు కష్టపడుతున్న రాహుల్ గాంధీ వైపు నిలబడాలా ఆలోచించు కోవాలన్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోదీని, బిజెపి నాయకులను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని లక్ష్మి నరసింహ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య,  నంద్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎస్ఎండీ ఫరూక్, పుల్లయ్య,రామకృష్ణ, శివరాంరెడ్డి, రవి    తదితరులు ఉన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: