ప్రధానోపాధ్యాయుని పై వచ్చిన వార్తలు అవాస్తవం

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని  కొనిదేడు గ్రామంలో ప్రధానోపాధ్యాయ వృత్తి లో కొనసాగుతున్న నాగేశ్వరరెడ్డి పై  ఒక విద్యార్థి సంఘం నాయకుడు ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా, నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధాకరమని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్ పేర్కొన్నారు. పాణ్యం మండల కేంద్రం లోని కొనిదేడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం నాగేశ్వర్ రెడ్డిపై కొన్ని వార్త పత్రికలలో వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని, పాఠశాల సమయంలో రికార్డు ప్రకారం నమోదు చేసి  పాఠశాలకు రెండవ విడతలో నాడు -నేడు పథకం మంజూరైనందున  విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో తన వంతు కృషి చేయాలని, ఆ సమయంలో మెటీరియల్ తక్కువ కావడంవలన   డిఇఓ పర్మిషన్ తీసుకుని ప్రహరి గోడ నిర్మించే వారిని తీసుకొని బయటకు వెళ్లడం జరిగినదని వెల్లడించారు. బయటికి వెళ్లే సమయంలో స్కూలుకు సంబంధించిన రికార్డులో నమోదు చేయడం జరిగినదని, కొనిదేడు గ్రామ పాఠశాలను సందర్శించడానికి వచ్చిన విద్యార్థి సంఘం నాయకుడు పాఠశాల హెచ్ఎం లేని టైంలో స్కూల్ లోకి వెళ్లి, ఉపాధ్యాయుల ఎవరి ప్రమేయం లేకుండా, ఆఫీస్ రూమ్ లో ఉన్న రికార్డ్స్ చూసి, ఆ రికార్డ్స్ ని ఫొటోస్ తీసుకుని ప్రెస్ నోట్ ఇవ్వడం బాధాకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


కొనిదేడు గ్రామంలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ రెడ్డి గతంలో రుద్రవరం మండలం, సిరివెళ్ల మండలం  లో పనిచేశారని,విధులు నిర్వహించిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తనకు ప్రభుత్వం నుండి వస్తున్న జీతం లో పాఠశాల అభివృద్ధి కొరకు కొంత ఆర్థిక సహాయం విద్యార్థులకు వారి మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టేవారని ఆయన వెల్లడించారు. కొనిదేడు గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ శిధిలావస్థకు చేరుకున్న పాఠశాలను రెండవ విడతలో  నాడు- నేడు కింద అభివృద్ధి చేస్తుంటే దాన్ని కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక ఈ విధమైన పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని, ఇది అవాస్తవమని బత్తిని ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  నంద్యాల జిల్లా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి రియాజ్, బాలకృష్ణ నాయక్,పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: