శివనామస్మరణ తో మారు మ్రోగిన..

శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని గడిగరేవుల గ్రామం లో వెలిసిన శ్రీ దుర్గాభగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం 3 వ సోమవారం సందర్బంగా స్వామి వారి ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో నిండిపోయింది.భక్తులు అశేష సంఖ్యలో పంచామృత కోనేర్లలో స్నానం ఆచరించి, స్వామి వారికి మహాన్యాస రుద్రాభిషేకములు, దూపదీప నైవేద్యములు సమర్పించి స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథులు గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య, పాణ్యం సిఐ వెంకటేశ్వర రావు  మరియు కాకానూరు పిఠాధిపతి శివయోగానంద సరస్వతి స్వామి వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అనంతరం కాకునూరు పీఠాధిపతి శివ యోగానంద సరస్వతి స్వామి వారు కార్తీక మాసం యొక్క విశిష్టతను భక్తులకు ఉపదేశించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా    EO&. ఛైర్మెన్ పాలక మండలి సభ్యులు,   ఆలయ సిబ్బంది, ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అశేష సంఖ్యలో శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు, సందర్శనానికి వచ్చిన వాహనాలకు ఎలాంటి అవంతరాలు కలుగకుండా గడివేముల ఎస్ఐ బి.టి. వెంకటసుబ్బయ్య తన సహచర పోలీసు సిబ్బంది తో కలిసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దైవదర్శనం చేసుకుని పోయే విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: