ఫిల్టర్ వాటర్ వద్దు...మిషన్ భగీరథ నీరు ముద్దు

విద్యార్థులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

ఫిల్టర్ వాటర్ తాగే కంటే మిషన్ భగీరథ నీరు తాగడం ఉత్తమమని మహేశ్వరం మండలం నాగారం జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులకు  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైనవి, సురక్షితమైనవి నేను కూడా ఇంట్లో మిషన్ భగీరథ నీరే తాగుతానని మంత్రి వెల్లడించారు. ఫిల్టర్ వాటర్ లో మినరల్స్ ఉండవనీ, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ముందు  మిషన్ భగీరథ నీరు తాగి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవగాహన పెంచేందుకు కృషి చేశారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: