నాటు సారా విక్రయ దారుల అరెస్టు
రిమాండ్ కు పంపిన గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎల్కే తాండ గ్రామం ఊరి బయట నాటుసారా బట్టి పెట్టుకొని తయారు చేస్తున్నారన్న పక్కసమాచారం తెలుసు కొన్న ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య అప్రమత్తమై వెంటనే తన సహచర సిబ్బందితో కలసి ఉదయం గ్రామం ఊరిబయట గల కొండలలో దాడులు నిర్వహించి ఎల్కే తాండ గ్రామానికి చెందిన సుభాష్ నాయక్(22 ),గని గ్రామంనకు చెందిన పెద్దన్న(35), వై కే తాండ గ్రామానికి చెందిన బుజ్జి బాయి నాటు సారాయి బట్టి పెట్టుకొని ఉండగా 40 లీటర్ల నాటు సారాయి, హోండా హెచ్ఎఫ్ డీలక్స్ మోటర్ సైకిల్ ను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య తెలిపారు.
Home
Unlabelled
నాటు సారా విక్రయ దారుల అరెస్టు,,, రిమాండ్ పంపిన గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: