ఇసుక డంపును తొలగించండి
ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నంద్యాల లోని నడిగడ్డ ఐదో వార్డులో ప్రజలు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ముస్లిం హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. Smd యూనుస్ అధికారులపై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల నడిగడ్డ నబి నగర్ లో అక్రమంగా వచ్చిన ఇసుక, డంపు చేస్తూ వచ్చిపోయే విద్యార్థులకు పాదచారులకు, వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందిగా కలిగిస్తూన్నారని, ప్రజలు ఇదెక్కడి న్యాయం అని అడిగే వారి మీద దుర్బాషలాడి, దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు వాపోతున్నారు. దీని మీద ఉన్నతాధి అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యస్ యం డి యూనుస్ డిమాండ్ చేశారు. ప్రజలు ఇళ్లకు వెళ్లే రహదారా లేకపోతే ఏమైనా హైవే రోడ్డా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక, డంప్ ను ఖాళీగా ఉన్న ప్రదేశాలలో నిలువ చేసుకునే విధంగా యజమాన్యులకు సూచించాలని కోరారు,రహదారిపై లారీలు, ట్రాక్టర్లు, బుల్డోజర్ వాహనాలు నిలపడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకోని వార్డు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Home
Unlabelled
ఇసుక డంపును తొలగించండి... ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: