బీసీ బిడ్డ ఇంటిపై... ఆ దొరల కనుసైగలతోనే దాడి

ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

ఎంపీ అరవింద్ ని పరామర్శించి సంఘీభావం ప్రకటించిన బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

బీసీ బిడ్డ .. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపైన గడీల దొర కెసిఆర్, కెటిఆర్, కవిత కనుసైగలతోనే దాడి జరిగిందని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్ర బిజెపిలో బీసీల ఎదుగుదల సహించలేక ముఖ్యంగా దొర కెసిఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితపై గెలిచినా మున్నూరుకాపు ముద్దుబిడ్డ ధర్మపురి అరవింద్ పై అడుగడుగునా దాడులు చేపిస్తూ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎవ్వరు కూడా కెసిఆర్ కు ఎదురు నిలబడొద్దు అనేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కెసిఆర్, కెటిఆర్, కవితకు ఉన్న విపరీత కులహంకారాన్ని రాష్ట్రంలో ప్రతి బీసీ, ఎస్సి, ఎస్టీ బిడ్డ గ్రహించాల్సిన అవసరం ఉందని బుక్క వేణుగోపాల్ కోరారు. ఈ దొర ఆగడాలను దొర రాజ్యాన్ని బొంద పెట్టే వరకు ఊరుకునేది లేదని, మా బీసీ నాయకుడి ఇంటిపై దాడి చేయించిన కెసిఆర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బుక్క వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: